News November 29, 2024
పాపం సమంత

టాప్ హీరోయిన్గా వెలిగిన సమంత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రేమించి, పెళ్లాడిన నాగచైతన్య నుంచి విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి ఆమెను మానసికంగా, శారీరకంగా కుంగదీశాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకుంటున్న సామ్కి తండ్రి మృతి మరో పెద్ద దెబ్బగా మారింది. కష్ట సమయంలో అండగా నిలిచిన తండ్రిని కోల్పోవడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
Similar News
News January 9, 2026
PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.
News January 9, 2026
IIT ఇండోర్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 9, 2026
కుబేర యోగం అంటే ఏంటి?

జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ధన యోగాల్లో ‘కుబేర యోగం’ ఒకటి. పేరుకు తగ్గట్టే ఈ యోగం ఉన్న వ్యక్తిపై కుబేరుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. సాధారణంగా రాజయోగాలు అధికారాన్ని ఇస్తే, కుబేర యోగం అంతులేని ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను ప్రసాదిస్తుంది. ఇది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన ధనాన్ని స్థిరంగా ఉంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ యోగం ఉన్నవారు సమాజంలో అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందుతారు.


