News March 12, 2025

SOSకు కాల్ చేసిన ప్రకాశం ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో అత్యవసర సేవలు అందిస్తున్న శక్తి యాప్ పనితీరు గురించి ఆరా తీశారు. ఎస్పీ స్వయంగా తన ఫోన్ నుంచి SOSకు కాల్ చేసి సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే అన్ని కాల్స్‌కు రెస్పాండ్ కావాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు.

Similar News

News December 15, 2025

ఒంగోలు మేయర్ అంటే.. లెక్కలేదా: సుజాత

image

ఒంగోలు మేయర్ గంగాడ సుజాతకు కోపమొచ్చింది. నేడు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు సైతం హాజరవుతున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకంపై మేయర్ సుజాత పేరు లేకపోవడం, అలాగే ఆహ్వాన పత్రికలో సైతం ఆమె పేరు లేకపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.

News December 15, 2025

జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.