News March 12, 2025
SOSకు కాల్ చేసిన ప్రకాశం ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో అత్యవసర సేవలు అందిస్తున్న శక్తి యాప్ పనితీరు గురించి ఆరా తీశారు. ఎస్పీ స్వయంగా తన ఫోన్ నుంచి SOSకు కాల్ చేసి సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే అన్ని కాల్స్‌కు రెస్పాండ్ కావాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు.
Similar News
News February 11, 2026
ప్రకాశం: మల్లన్న దర్శనాలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. పులి సంచారం

నల్లమల అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్తున్న భక్తులకు మంగళవారం పెద్దపులి కంటబడింది. పెచ్చేరువులో అన్నదాన శిబిరానికి సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులకు ఓ పెద్ద పులి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు తమ మొబైల్స్‌లో పెద్ద పులిని చిత్రీకరించారు. కాగా అభయారణ్యంలో కాలినడకన వెళ్లే భక్తులు జాగ్రత్తలు వహించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
News February 11, 2026
అందరి చూపు MLA తాటిపర్తి పైనే.!

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో YCP MLAలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే కేవలం సంతకాలు పెట్టడం వరకే కాకుండా అసెంబ్లీలో ఉండాలని, ప్రజల సమస్యలను లేవనెత్తాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడూ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీలో గళం విప్పుతాడని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
News February 11, 2026
అందరి చూపు MLA తాటిపర్తి పైనే.!

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో YCP MLAలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే కేవలం సంతకాలు పెట్టడం వరకే కాకుండా అసెంబ్లీలో ఉండాలని, ప్రజల సమస్యలను లేవనెత్తాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఎప్పుడూ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీలో గళం విప్పుతాడని నియోజకవర్గ వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.


