News November 15, 2024
‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గింపు?
నిన్న విడుదలైన కంగువ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడియో చాలా లౌడ్‌గా, ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రెసూల్ సైతం దీనిపై పెదవి విరిచారు. పెద్ద సినిమాలు సౌండ్ డిజైనింగ్ లౌడ్నెస్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గించాలని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూచించినట్లు తెలుస్తోంది.
Similar News
News November 15, 2024
శ్రద్ధా వాకర్ హత్య: అఫ్తాబ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ ‘స్కెచ్’
రెండేళ్ల క్రితం దేశంలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో పట్టుబడ్డ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శివకుమార్ ఈ విషయం చెప్పినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పూనావాలాకు భద్రత పెంచడంతో ఆ నిర్ణయాన్ని గ్యాంగ్ విరమించుకున్నట్లు చెప్పారు. శ్రద్ధను పూనావాలా చంపి 35 ముక్కలు చేసిన విషయం తెలిసిందే.
News November 15, 2024
16,347 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు శుభవార్త
AP: 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుంది. వెనుకబడిన వర్గాల వారికి <<14588103>>ఆన్లైన్లో <<>>ఉచిత DSC కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే ప్రత్యేక వెబ్సైటు రూపొందించి, నిపుణులతో క్లాసులు నిర్వహించి, క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్‌లో అర్హత సాధించిన వారు ఉచిత ఆన్లైన్ కోచింగ్‌కు అర్హులని మంత్రి తెలిపారు.
News November 15, 2024
నిర్మలతో ముగిసిన చంద్రబాబు భేటీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలోని నిర్మల నివాసంలో వీరిద్దరూ దాదాపు గంటసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ కొనసాగినట్లు సమాచారం. మరోవైపు ఇతర కేంద్ర మంత్రులనూ చంద్రబాబు కలుస్తారని వార్తలు వస్తున్నాయి.