News March 12, 2025
సౌందర్య మృతి.. మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు

అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘శంషాబాద్‌లోని జల్పల్లిలో ఆరెకరాల భూమిని విక్రయించేందుకు సౌందర్య, ఆమె సోదరుడు నిరాకరించడం పెద్ద వివాదమైంది. ఇదే హత్యకు దారి తీసింది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్‌బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు’ అని ఆయన తెలిపారు.
Similar News
News March 12, 2025
పండగే.. వచ్చే 19 రోజుల్లో 8 రోజులు సెలవులు

ఐటీ, ITES ఉద్యోగులకు రానున్న రెండు వారాలు ఆఫీసులకు వెళ్లినట్లే అన్పించదు. ఎందుకంటే మాసంలో మిగిలిన 19 రోజుల్లో 8 రోజులు సెలవులే. 14న హోలీ, 15-16 వీకెండ్ కావడంతో వరుసగా మూడ్రోజులు హాలీడే. ఇక 22-23 వీకెండ్. తిరిగి 29న వీకెండ్, 30 సండే+ఉగాది ఉండగా 31న రంజాన్ సందర్భంగా సెలవు. మొత్తం 8 సెలవుల్లో 2సార్లు 3 రోజుల చొప్పున లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో సరదాగా ట్రిప్‌కు వెళ్లే వారు ప్లాన్స్ మొదలుపెట్టారు.
News March 12, 2025
కళ్లు పొడిబారుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. బ్లూలైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడటం బెటర్.
News March 12, 2025
CM రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్

TG: సీఎం రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి, తేజస్విని అనే మహిళలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి రెండు ల్యాప్టాప్స్, ఫోన్లను సీజ్ చేశారు.