News June 30, 2024
17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

భారత్తో ఏకైక టెస్టులో సౌతాఫ్రికా కేవలం 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 236/4తో 3వ రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు 249 దగ్గర 5వ వికెట్ కోల్పోగా 266 రన్స్కే ఆలౌటై ఫాలోఆన్లో పడింది. 2వ ఇన్నింగ్స్లో 16/1గా ఉన్న ఆ జట్టు ఇంకా 321 రన్స్ వెనకబడి ఉంది. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8/77తో సఫారీల నడ్డి విరిచారు. అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలుపును సౌతాఫ్రికా అడ్డుకోలేదు.
Similar News
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్నకు 1.4 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.


