News June 29, 2024
సౌతాఫ్రికా 10 ఓవర్లకు 81/3

T20WC ఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 రన్స్ చేశారు. క్రీజులో డికాక్(30), క్లాసెన్(8) ఉన్నారు. హెండ్రిక్స్ 4, మార్క్రమ్ 4, స్టబ్స్ 31 పరుగులకు ఔటయ్యారు. బుమ్రా, అర్ష్దీప్, అక్షర్ తలో వికెట్ తీశారు. విజయం కోసం దక్షిణాఫ్రికా 60 బంతుల్లో 96 రన్స్ చేయాలి.
Similar News
News February 2, 2026
పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే..?

ఓ అరిటాకు తీసుకొని దానిపై మీరు చేసిన పిండి ప్రమిదను ఉంచాలి. అందులో అఖండ వత్తిని వేసి, ఆవునేతితో నింపాలి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని పలుకుతూ దీపం వెలిగించాలి. అనంతరం తర్వాత విష్ణు సహస్రనామం, అష్టోత్తరం చదువుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత, ఆ పిండిని చక్కెర పొంగలి లేదా గారెల్లా చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఏడు శనివారాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
News February 2, 2026
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు FEB 25 వరకు గడువు

JEE మెయిన్ తుది విడత పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్య జరగనున్నాయి. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 29తో ముగిశాయి. వీటి ఫలితాలను ఈ నెల 12వ తేదీలోపు వెల్లడించనున్నారు.
News February 2, 2026
కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.


