News June 11, 2024
సూపర్-8కి సౌతాఫ్రికా?

T20WC సూపర్-8లో సౌతాఫ్రికాకు దాదాపు బెర్తు ఖరారైంది. ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన సఫారీ టీమ్ 6 పాయింట్లతో గ్రూప్-D టాపర్గా ఉంది. అదే గ్రూప్లో రెండేసి పాయింట్లతో 2&3 స్థానాల్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నా ఆ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. అందులో ఒక జట్టే SAతో సూపర్-8 చేరే ఛాన్స్ ఉంది. నేపాల్ 3 మ్యాచుల్లోనూ గెలిస్తేనే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆడిన రెండింట్లోనూ ఓడిన శ్రీలంక దాదాపు నిష్క్రమించినట్లే.
Similar News
News October 22, 2025
పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <
News October 22, 2025
రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News October 22, 2025
BRSకు ముందే తెలుసా?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రద్యుమ్న అనే వ్యక్తి చేసిన <<18073070>>ఆరోపణలు<<>> వైరలవుతున్నాయి. ఇలాంటిది ఏదో జరిగి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తప్పవని BRS ముందుగానే ఊహించిందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్తో నామినేషన్ వేయించిదనే టాక్ విన్పిస్తోంది. ప్రద్యుమ్న ఆరోపణలపై సునీత గానీ, BRS గానీ ఇంకా స్పందించలేదు.