News April 24, 2024
DCలోకి సౌతాఫ్రికా విధ్వంసకర ప్లేయర్

గాయం కారణంగా టోర్నీకి దూరమైన మిచెల్ మార్ష్ స్థానాన్ని భర్తీ చేసేపనిలో ఢిల్లీ క్యాపిటల్స్ పడింది. అతడి స్థానంలో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు రస్సీ వాండర్ డస్సెన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. IPL 2024 మినీ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. ఇప్పుడు అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో కొనుగోలు చేసినట్లు టాక్. కాగా డస్సెన్ గత PSLలో 7 మ్యాచ్‌ల్లోనే 364 రన్స్ బాది సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచారు.
Similar News
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.
News December 6, 2025
కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.
News December 6, 2025
రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

AP: అతి తక్కువ ధరకే వారసత్వ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దానికంటే ఎక్కువైతే రూ.1,000 స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించిన ఆస్తులకే ఈ రాయితీ వర్తిస్తుంది.


