News July 19, 2024
సౌతాఫ్రికా టీ20 లీగ్: ముంబై ఇండియన్స్‌లోకి స్టోక్స్?

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరఫున ఆయన బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రూ.8.5 కోట్లు వెచ్చించి అతడిని ఎంఐ ఫ్రాంఛైజీ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు జో రూట్ కూడా పార్ల్ రాయల్స్ తరఫున SA20 2025 ఆడనున్నట్లు టాక్.
Similar News
News November 28, 2025
బాపట్ల జిల్లాపై తుఫాన్ ప్రభావం..!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ మ్యాప్ విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం వలన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
News November 28, 2025
రూ.2.4 కోట్లు పలికిన కరీంనగర్ క్రికెటర్

అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, KNRకు చెందిన శిఖాపాండే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఏకంగా రూ. 2.4కోట్లు దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేలంలో 36 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను బేస్ ధర రూ.40 లక్షలు కాగా, UP వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. రామగుండం NTPC ఉద్యోగి కుమార్తె అయిన శిఖాపాండే రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా, కోట్లు పలకడం మహిళల క్రికెట్ ఆదరణకు నిదర్శనం.
News November 28, 2025
బీసీ రిజర్వేషన్లు పెంపులో జగిత్యాల రెండో స్థానం

ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. ఇందులో 1వ స్థానంలో హనుమకొండ ఉండగా.. 2వ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. 2019 ఎన్నికల్లో 25.07 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లు 2025లో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 27.19 శాతానికి పెరిగి, గతంలో కంటే ప్రస్తుతం 2.12 శాతం బీసీ రిజర్వేషన్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.


