News March 1, 2025
సెమీస్‌కు వెళ్లాలని సౌతాఫ్రికా.. పరువు కోసం ఇంగ్లండ్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మ.2.30 గంటలకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో 3 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న SA ఇందులో గెలిచి సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న ENG చివరి గేమ్‌లోనైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే AUS సెమీస్‌లో అడుగుపెట్టింది. ENG చేతిలో SA భారీ తేడాతో ఓడితే అఫ్గాన్ సెమీస్ చేరుతుంది.
Similar News
News March 1, 2025
6న తెలంగాణ క్యాబినెట్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనుంది. వీటిని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. అనంతరం వాటిని పార్లమెంటుకు పంపి చట్టం చేయాలని కేంద్రాన్ని కోరనుంది. ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News March 1, 2025
భారత్‌లో రేపట్నుంచి రంజాన్ మాసం ప్రారంభం

భారత్‌లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మెుదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
News March 1, 2025
నేడు చిత్తూరు జిల్లాలో CM చంద్రబాబు పర్యటన

AP: CM చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి విజయవాడకు తిరుగు పయనమవుతారు. మరోవైపు, మంత్రి లోకేశ్ ఇవాళ మంత్రాలయంలో పీఠాధిపతి చేతుల మీదుగా గురువైభోత్సవం అవార్డు అందుకోనున్నారు.