News June 26, 2024

అఫ్గానిస్థాన్‌ను ఓడిస్తే కప్ సౌతాఫ్రికాదే: హాగ్

image

సెమీస్‌లో అఫ్గాన్‌ను ఓడిస్తే T20 WC ట్రోఫీ ఇక దక్షిణాఫ్రికాదేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. ‘మార్క్రమ్‌ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా బాగా ఆడుతోంది. హెండ్రిక్స్, క్లాసెన్‌, షమ్సీ, మహరాజ్‌ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆ జట్టుకు ఉన్నారు. ఒత్తిడిని తట్టుకుంటే విజయం వారిదే’ అని విశ్లేషించారు. అఫ్గాన్, సౌతాఫ్రికాకు మధ్య ట్రినిడాడ్‌లో రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం సెమీ ఫైనల్ జరగనుంది.

Similar News

News December 13, 2025

రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 13, 2025

బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్‌లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.