News August 5, 2024
సౌత్ కొరియా.. ఆర్చరీలో 7 మెడల్స్

పారిస్ ఒలింపిక్స్ <<13733225>>ఆర్చరీలో<<>> సౌత్ కొరియా క్లీన్స్వీప్ చేసింది. ఉమెన్స్ టీమ్, మెన్స్ టీమ్, మిక్స్డ్ టీమ్, ఉమెన్స్ ఇండివిడ్యువల్, మెన్స్ ఇండివిడ్యువల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. అంతేకాదు ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ కలిపి ఒక్క ఆర్చరీ విభాగంలోనే 7 పతకాలు కొల్లగొట్టింది. ఆ దేశంలో చిన్నప్పటి నుంచి ఆర్చరీలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News October 18, 2025
K-Ramp పబ్లిక్ టాక్

కిరణ్ అబ్బవరం-డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని కాంబోలో తెరకెక్కిన K-Ramp చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే USలో ప్రీమియర్స్ పడ్డాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, వన్ లైనర్ పంచ్లు అలరించాయని NRI ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లా లేదని, డబుల్ మీనింగ్ డోస్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అంటున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.
News October 18, 2025
ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

నగలు పెట్టుకున్నపుడు కొందరికి అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్ అనే లోహం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. వీటిని వేసుకొనేముందు పౌడర్/ మాయిశ్చరైజర్/ క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది. లేదంటే స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం, 18 క్యారెట్ ఎల్లో గోల్డ్, స్టెర్లిన్ సిల్వర్లను ఎంచుకోవచ్చు.
News October 18, 2025
DRDO PXEలో 50 అప్రెంటిస్లు

DRDOకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్పరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్(PXE) 50 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గలవారు ఈనెల 19 వరకు training.pxe@gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in