News October 30, 2025

టారిఫ్‌ల తగ్గింపు కోసం USకు 350B డాలర్లు చెల్లించనున్న ద.కొరియా

image

టారిఫ్‌ల తగ్గింపు కోసం తమకు 350B డాలర్లు చెల్లించేందుకు ద.కొరియా ఒప్పుకుందని US ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్నారు. US నుంచి ఆయిల్, గ్యాస్‌ను భారీ మొత్తంలో కొనేందుకు కూడా ద.కొరియా అంగీకరించిందని తెలిపారు. ఆ దేశ కంపెనీలు USలో పెట్టే పెట్టుబడుల విలువ $600Bను మించిపోతుందన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణానికి వారికి అనుమతినిచ్చినట్లు చెప్పారు.

Similar News

News February 13, 2026

ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

image

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News February 13, 2026

ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టారని ప్రజలకు CM రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పుతో సంపూర్ణ ఆమోదం తెలిపారని ట్వీట్ చేశారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.

News February 13, 2026

వైట్ కాలర్ జాబ్స్‌ను AI భర్తీ చేస్తుంది: మైక్రోసాఫ్ట్ AI చీఫ్

image

రాబోయే 12 నుంచి 18 నెలల్లో కంప్యూటర్ ఆధారిత ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందని మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, మార్కెటింగ్, లీగల్, డేటా ఎంట్రీ వంటి పనులు ఆటోమేషన్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల పని వేగం, ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని ఆయన విశ్లేషించారు. టెకీలు తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.