News December 11, 2024

దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం

image

దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యూన్ పోలీస్ కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ దేశంలో మార్షల్ లా అమలు చేసేందుకు ఈ నెల 3న జరిగిన విఫలయత్నం వెనుక ప్రధాన కారణం ఆయనేనన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయన తన రక్షణమంత్రి పదవికి రాజీనామా చేయగా, పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో తన అండర్‌వేర్‌ వాడి సూసైడ్ చేసుకునేందుకు కిమ్ ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

Similar News

News December 4, 2025

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

image

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.

News December 4, 2025

ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

image

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్‌ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్‌కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.

News December 4, 2025

160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BHEL<<>>) 160 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, డిప్లొమా, డిగ్రీ(BE, బీటెక్, BBA) అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NATS పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://bpl.bhel.com/