News May 14, 2024
నాలుగు రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’

భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
Similar News
News March 26, 2026
RCBకి కొత్త ఓనర్లు.. విజయ్ మాల్యా అభినందనలు

RCB కొత్త యజమానులకు ఒకప్పటి ఓనర్, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. 2008లో ₹450కోట్లు పెట్టి ఈ ఫ్రాంచైజీ కొన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని.. కానీ అదే ₹16,500Cr విలువైన బ్రాండ్‌గా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. RCB ఎప్పటికీ తన డీఎన్ఏలో భాగమని.. యువ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం చెరగని జ్ఞాపకమని అన్నారు. తన హయాంలో, ఆ తర్వాతా RCBకి మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
News March 26, 2026
‘హంద్రీ-నీవా’ రెండో దశకు గ్రీన్ సిగ్నల్

AP: హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డు/రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ, ఆధునికీకరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
News March 26, 2026
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి)-లక్షణాలు

ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.


