News July 26, 2024
సావరిన్ గోల్డ్ బాండ్స్ బంద్?

2015లో అందుబాటులోకి వచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌కు ముగింపు పలకాలని కేంద్రం భావిస్తోందట. ఈ నిర్వహణ భారంగా మారడటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాల సమాచారం. బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్ డ్యూటీని 15% నుంచి 6%కు తగ్గించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా ఈ తగ్గింపు తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్స్ డిమాండ్ భారీగా తగ్గింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీలో గరిష్ఠంగా 5% నష్టం నమోదైంది.
Similar News
News January 29, 2026
రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రండి: కేసీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.
News January 29, 2026
ప్రధానిగా మోదీనే బెస్ట్: ఇండియా టుడే సర్వే

భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని వివరించింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు పేర్కొంది.
News January 29, 2026
పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.


