News March 24, 2024
రెబల్‌గా సోయం బాపురావు పోటీ?

TG: ఆదిలాబాద్ జిల్లాలో BJPకి షాక్ తగిలే అవకాశం ఉంది. సిట్టింగ్ MP సోయం బాపురావు రెబల్‌గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బుజ్జగించినా సోయం వెనక్కి తగ్గడం లేదు. పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్న ఆయన.. క్యాడర్ ఉన్న తాను కావాలో? వలస నేత కావాలో తేల్చుకోవాలని అధిష్ఠానానికి సవాల్ విసిరారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సోయం తెలిపారు.
Similar News
News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
News October 22, 2025
ఐస్‌లాండ్‌లో కనిపించిన దోమలు

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్‌ల్యాండ్‌లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.
News October 22, 2025
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది: రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనని, జాగ్రత్తగా ఖర్చు పెడతానని తెలిపారు. ఆధ్యాత్మికతకు ప్రియారిటీ ఇస్తానని తెలిపారు. గతంలో రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె <<16044331>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.