News March 16, 2025

SP నుంచి ఉత్తమ CIగా ప్రశంస.. ఒక్కరోజులోనే సస్పెండ్

image

రెండు రోజుల క్రితం SP నుంచి ఉత్తమ పని తీరు కనబరిచిన CI.. 24 గంటలు గడవక ముందే సస్పెండ్ కావడం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పుంగనూరులో శనివారం రామకృష్ణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో DIG ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన SP మణికంఠ.. పుంగనూరు CI శ్రీనివాసులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. దీంతో CIతోపాటూ హెడ్ కానిస్టేబుల్‌ను స్సస్పెండ్ చేశారు.

Similar News

News February 12, 2026

చిత్తూరు: YCP కమిటీ నియామకాల విడుదల

image

చిత్తూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ సెక్రటరీగా పుంగనూరు కమతంపల్లికి చెందిన కొమ్మిరి కుమార్, డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఈశ్వర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

News February 12, 2026

చిత్తూరు: ఓటర్ల జాబితాకు కసరత్తు!

image

జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుంగనూరు, నగరి, పలమనేరు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పాలకమండలి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది. చిత్తూరులో 50 డివిజన్లు, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా మార్చి 9న ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు చర్యలు చేపట్టారు.