News March 16, 2024
రూ.83 లక్షల విలువ చేసే 311 సెల్ ఫోన్లు అందజేసిన ఎస్పీ

కొన్ని నెలల నుంచి ఉమ్మడి జిల్లాలో చోరికి గురైన 311 మొబైల్ ఫోన్లను జిల్లా SP అన్బురాజన్ శనివారం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో జిల్లా పోలీసులు ఎక్కడా రాజీపడలేదని, అనంత నుంచి 259, శ్రీ సత్యసాయి 31, కర్నూలు 10, కర్ణాటక 5, చిత్తూరు 3, తెలంగాణ 2, గుంటూరు జిల్లా నుంచి 1 రికవరీ చేసి అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 7, 2025
నేటి నుంచి ఎండతీవ్రత

అనంతపురం జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తరచూ నీరు తాగాలని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News April 7, 2025
జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.
News April 7, 2025
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన రూట్ మ్యాప్ ఇదే!

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటన రూట్ మ్యాప్ వెలువడింది. రేపు ఆయన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రానున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్‌లో సీకే పల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన పాపిరెడ్డిపల్లికి వెళ్తారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో దారుణ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు బయలుదేరనున్నారు.