News February 8, 2025
7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.
Similar News
News November 14, 2025
రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ప్రముఖ బ్రూక్ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.
News November 14, 2025
బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.
News November 14, 2025
శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలంటే?

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకార్థం. భగవంతుడ్ని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ, ప్రతి కర్మనూ అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారానే ఆయన అనుగ్రహం పొందగలం. అందుకే అనుక్షణం పరమాత్మ చింతనతో జీవించాలని పండితులు చెబుతారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


