News January 29, 2025
బజరంగదళ్ సభ్యుల సమాచారం కోరిన ఎస్పీ.. బాధ్యతల నుంచి తొలగింపు

బజరంగదళ్ నేతలు, సభ్యుల సమాచారం సేకరించాలని అన్ని స్టేషన్లకు వైర్లెస్ మెసేజ్ పంపిన South Goa SP సునీతా సావంత్ను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. సాధారణంగా SP స్థాయి అధికారి బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తుంది. అయితే ఇక్కడ గోవా పోలీసులు వైర్లెస్ సందేశం ద్వారా ఆమెను తప్పించడం గమనార్హం. బజరంగదళ్ ఒత్తిడి మేరకే ఆమె బదిలీ జరిగినట్టు తెలుస్తోంది.
Similar News
News December 11, 2025
సర్పంచ్గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RRకాలనీ సర్పంచ్గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మరణించడంతో గ్రామస్థులు ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేద్దామన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
News December 11, 2025
చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.
News December 11, 2025
ఇంటికి ఒకే ద్వారం ఉండవచ్చా?

పెద్ద ఇంటికి ఒకే ద్వారం నియమం వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుడికి ఒకే ద్వారం ఉంటుంది. కిటికీలు ఉండవు. ఇల్లు కూడా అలాగే ఉండవచ్చు కదా? అని చాలామంది అనుకుంటారు. కానీ ఇళ్లు, ఆలయాలు ఒకటి కాదు. వాస్తు నియమాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో మనుషులు నివసిస్తారు కాబట్టి రాకపోకలకు, గాలి, వెలుతురుకు ద్వారాలు, కిటికీలు తప్పనిసరి, చిన్న ఇంటికి ఓ ద్వారం ఉన్నా పర్లేదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


