News March 26, 2025

‘అంతరిక్ష వ్యవసాయం’

image

స్పేస్‌లో జరుగుతున్న పరిశోధనల్లో ఇదీ ఒకటి. ISSకు వెళ్లే వ్యోమగాములకు సరిపడా ఆహారాన్ని ప్రాసెస్డ్ చేసి పంపిస్తుంటారు. అక్కడే వ్యవసాయం చేసుకోగలిగితే వారు స్వయంగా తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతారని ఈ పరిశోధన ఉద్దేశం. అలాగే ఆ మొక్కల నుంచి స్పేస్‌లో ఆక్సిజన్ వెలువడుతుంది. అయితే, స్పేస్‌లో సూర్యరశ్మి, నీరు, ఆక్సిజన్, భూమి లేనప్పటికీ అక్కడ మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.

Similar News

News March 29, 2025

రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనకాడొద్దు: సీఎం

image

TG: HRDCL రోడ్డు నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలో నిర్మించాల్సిన రహదారులు, వాటి విస్తరణలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అవసరమైతే అదనపు స్థల సేకరణ జరపాలని, నిధులకోసం వెనకాడవద్దని స్పష్టం చేశారు.

News March 29, 2025

హిమాచల్‌తో విద్యుత్ ఒప్పందం గొప్ప ముందడుగు: భట్టి

image

TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హిమాచల్‌ప్రదేశ్‌తో 520MW ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇదొక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్‌ కంటే జల విద్యుత్ వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. హిమాచల్‌లో జీవ నదులు ఎక్కువగా ఉన్నందున 9-10నెలలు విద్యుత్ ఉత్పత్తికి వీలు ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకే పవర్ దొరుకుతుందని పేర్కొన్నారు.

News March 29, 2025

ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

image

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT

error: Content is protected !!