News September 23, 2024

2026 అక్టోబరుకల్లా మార్స్‌పైకి వ్యోమనౌకలు: మస్క్

image

2026 అక్టోబరుకల్లా అంగారకుడిపై వ్యోమనౌకలు ల్యాండ్ అయ్యేలా చేస్తామని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. ఆసక్తి కలవారందరినీ మార్స్‌పైకి పంపించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రోదసియానం అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ‘వచ్చే రెండేళ్లలో మానవరహిత వ్యోమనౌకలు ఐదింటిని పంపిస్తాం. అవి సురక్షితంగా ల్యాండ్ అయితే ఆ తర్వాతి నాలుగేళ్లలో మానవసహిత వ్యోమనౌకల్ని ప్రయోగిస్తాం’ అని వెల్లడించారు.

Similar News

News November 27, 2025

పీరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

image

పీరియడ్స్‌లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్‌, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్‌, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్‌స్మియర్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సోనోహిస్టరోగ్రామ్‌, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.

News November 27, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>మెదక్ <<>>ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 కాంట్రాక్ట్ డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, AMIE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300. జీతం నెలకు రూ.30వేలు+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in

News November 27, 2025

పంచాయతీ ఎన్నికల్లోనూ స్ట్రాటజిస్టుల ఎంట్రీ!

image

TG: ఇప్పటివరకు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకే పరిమితమైన వ్యూహకర్తలు, ఏజెన్సీలు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్‌లోకీ ఎంట్రీ ఇచ్చాయి. ‘ప్రచారం ఎలా చేయాలి? ప్రజలతో ఎలా మాట్లాడాలి? సర్వే చేసి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? విజయావకాశాలు ఎలా పెంచుకోవాలి?’ వంటి అంశాలన్నీ తామే చూసుకుంటామని SMలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలే టార్గెట్‌గా అభ్యర్థులకు స్ట్రాటజిస్టులు వల విసురుతున్నారు.