News July 15, 2024

యూరో కప్-2024 విజేతగా స్పెయిన్

image

యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఆ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో టైటిల్. ఆ జట్టులో విలియమ్ 48వ నిమిషంలో, ఓయర్జాబల్ 86వ నిమిషంలో గోల్ చేశారు. ఇంగ్లండ్ టీమ్‌లో పామర్ 73వ నిమిషంలో గోల్ సాధించారు.

Similar News

News November 4, 2025

పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

News November 4, 2025

విశాఖలో భూప్రకంపనలు

image

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.

News November 4, 2025

రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

image

<>రబ్బర్ బోర్డ్‌<<>>లో 51 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc, PhD, బీటెక్, BE, ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు రూ.1500, గ్రూప్ బీ పోస్టులకు రూ.1000, గ్రూప్ సీ పోస్టులకు రూ.500. SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://recruitments.rubberboard.org.in/