News March 6, 2025
రాష్ట్ర సమస్యలపై గళమెత్తండి: ఎంపీలతో జగన్

AP: రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలని, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలని, దానిపై కేంద్రం స్పందించేలా చొరవ చూపాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారికి జగన్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 7, 2025
త్వరలో ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.
News March 6, 2025
రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.
News March 6, 2025
నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/