News November 20, 2024
అధికారులపై స్పీకర్ అయ్యన్న ఫైర్

AP: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. వారి నిర్లక్ష్యంతోనే అసెంబ్లీలో గందరగోళం నెలకొందని ఆయన ఫైర్ అయ్యారు. ‘అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారు? ఒకే మంత్రికి ఒకే సమయంలో రెండు సభల్లో ఎలా ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఒకటి. మంత్రిత్వ శాఖ మరొకటి ఉంటుంది. మరోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News February 19, 2026
ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం
News February 19, 2026
NCERT ‘ఇ-మ్యాజిక్ బాక్స్’.. AIతో ఇక సరదాగా చదువు

3 నుంచి 8 ఏళ్ల చిన్నారుల కోసం NCERT సరికొత్త AI ఆధారిత ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో కథలు చెప్పే ‘కథా సఖి’, తల్లిదండ్రుల సందేహాలు తీర్చే ‘పేరెంట్ తార’, ఉపాధ్యాయులకు బోధనలో సాయపడే ‘టీచర్ తార’ అనే 3 స్మార్ట్ బాట్‌లు ఉన్నాయి. ఆటపాటల ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడంతో పాటు వారు అడిగే ప్రశ్నలకు ఈ యాప్ వెంటనే AI సాయంతో సమాధానాలిస్తుంది.
News February 19, 2026
రూ.50Kకే మ్యాక్‌బుక్ ఎయిర్?

మార్చ్ 4న జరిగే కంపెనీ ఈవెంట్‌లో లోకాస్ట్ మ్యాక్‌బుక్‌ను యాపిల్ లాంఛ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం మ్యాక్ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఎయిర్ వర్షన్ తక్కువ ధర. అయితే అది కూడా రూ.1లక్షకు సమీపంలో ఉండగా, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే డివైజ్ ధర రూ.50వేలు ఉండొచ్చని టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇందులో A18 చిప్, ai సహా పలు ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఈవెంట్‌లో 17e మొబైల్‌నూ యాపిల్ రిలీజ్ చేయనుంది.


