News August 24, 2025
బీసీ బిల్లుపై అమిత్‌షాను కలిసిన స్పీకర్

TG: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సదస్సు సందర్భంగా ఆయనను కలిసి బిల్లు ప్రస్తావన తెచ్చారు. ‘అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దీని గురించి సీఎం రేవంత్ మిమ్మల్ని ప్రత్యేకంగా కలిశారు’ అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని అమిత్‌షా బదులిచ్చారు.
Similar News
News January 5, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 5, 2026
అమెరికా ఆధిపత్యంపై వ్యతిరేక గళం

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్టును పలు దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ముఖ్యంగా USని శత్రువుగా భావించే దేశాలు దీనిని దుందుడుకు చర్యగా అభివర్ణిస్తున్నాయి. ట్రంప్ నియంతృత్వ స్వభావానికి ఇదో ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చైనా, రష్యా, క్యూబా, మెక్సికో, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఉరుగ్వే, నార్వే, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికా ఆధిపత్య ధోరణికి వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నాయి.
News January 5, 2026
నీళ్లు.. నిప్పులు!

ఉమ్మడి ఏపీలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రం ఏర్పడ్డాక AP, TG ప్రభుత్వాలు తమతమ సంపద సృష్టించుకుంటున్నాయి. ఎక్కడివారికి అక్కడే ఉద్యోగాలూ లభిస్తున్నాయి. కానీ నీళ్ల విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోంది. కృష్ణా జలాల్లో వాటా, ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటున్నారు. ఇవాళ SCలో నల్లమల సాగర్‌పై విచారణ జరగనుంది.


