News June 26, 2024
స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ని ఖండించడం సంతోషకరం: మోదీ

లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా ‘ఎమర్జెన్సీ’ని ఖండించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎమర్జెన్సీ సమయంలో చేసిన అతిక్రమణలను ఎత్తిచూపినందుకు, ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన తీరును ప్రస్తావించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ రోజుల్లో బాధపడ్డ వారందరి గౌరవార్థం మనందరం సభలో స్మరించుకోవడం అద్భుతమైన సన్నివేశం. ‘ఎమర్జెన్సీ’ గురించి నేటి యువత తెలుసుకోవడం ముఖ్యం’ అని మోదీ అన్నారు.
Similar News
News January 25, 2026
పాక్ హెచ్చరికలపై ICC సీరియస్?

బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై ICC ఆగ్రహించినట్లు తెలుస్తోంది. బంగ్లాను వెనకేసుకొస్తూ PCB ఛైర్మన్ <<18949866>>నఖ్వీ<<>> చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటామన్న పాక్ హెచ్చరికలపై ICC సీరియస్ అయినట్లు సమాచారం. టోర్నీని బహిష్కరిస్తే.. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌తో పాటు ఆటగాళ్లకు ఇచ్చే NOCలను కూడా రద్దు చేస్తామన్నట్లు తెలుస్తోంది.
News January 25, 2026
ఛీటింగ్ ఆరోపణలు.. రూ.10 కోట్ల దావా వేసిన పలాష్ ముచ్చల్

₹40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అమ్మాయితో మంచంపై <<18940645>>అడ్డంగా దొరికాడని<<>> తనపై వస్తున్న ఆరోపణలపై పలాష్ ముచ్చల్ కోర్టుకెక్కారు. ₹10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని స్పష్టం చేశారు. ‘నా పరువు, వ్యక్తిత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్ ద్వారా విజ్ఞాన్ మానేకు లీగల్ నోటీసు పంపాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
News January 25, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


