News December 6, 2024
‘డాకు మహారాజ్’లో ఆ హీరోల స్పెషల్ అప్పియరెన్స్?

బాబీ డైరెక్షన్లో తెరకక్కుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’పై ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొంతమంది యువ స్టార్ హీరోలు ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆ యువహీరోలు ఎవరు, ఏ పాత్రల్లో కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.
Similar News
News November 14, 2025
బిహార్ కౌంటింగ్ అప్డేట్

✦ NDA 49, MGB 39 స్థానాల్లో లీడింగ్
✦ రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ లీడ్
✦ అలీనగర్‌లో మైథిలీ ఠాకూర్ (BJP) ముందంజ
✦ తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి లీడ్
✦ మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆధిక్యం
✦ మోకామాలో అనంత్ సింగ్ (JDU) ముందంజ
News November 14, 2025
యాసంగి వరి సాగు.. ఆలస్యం వద్దు

TG: యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. నాట్లు ఆలస్యమైన కొద్దీ పంట దిగుబడులతో పాటు బియ్యం శాతం తగ్గి నూకశాతం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యాసంగి సాగుకు జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, R.S.R-29325, M.T.M-1010, తెల్లహంస, సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, K.N.M-1638, K.N.M-733, W.G.L-962, జగిత్యాల సాంబ J.G.L-27356, R.N.R-21278 రకాలు అనుకూలం.
News November 14, 2025
తిలకధారణలో ఉన్న శాస్త్రీయత ఏంటి..?

స్త్రీలు కుంకుమ ధరించడం మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. వివాహిత స్త్రీకి ఇది గొప్ప మంగళసూచకం. నుదుటి మధ్యభాగం ఆజ్ఞాచక్రం కలిగిన కేంద్రం. ఈ కేంద్రం జ్ఞానశక్తికి, ఆలోచనా శక్తికి ముఖ్య ఆధారం. ఇక్కడ కుంకుమను ధరించడం ద్వారా స్త్రీ ‘నేను శక్తి స్వరూపిణిని’ అని ప్రకటిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా మనసును ఏకాగ్రం చేసి, మనలోని శక్తిని పెంచడానికి, శాశ్వత సౌభాగ్యాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది. <<-se>>#Scienceinbelief<<>>


