News January 30, 2025
ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!

TG: ఫిబ్రవరి 7న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కులగణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అంతకుముందే ఫిబ్రవరి 2న క్యాబినెట్ సబ్ కమిటీకి అధికారులు కులగణన సర్వే రిపోర్టును అందజేయనున్నారు. 5న క్యాబినెట్ సమావేశం జరగనుండగా, కులగణన సర్వే నివేదికను ఆమోదించనున్నారు.
Similar News
News December 3, 2025
మంచిర్యాల: ఎన్నికల రోజు సెలవు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు పోలింగ్ కోసం ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలకు ప్రభత్వ సెలవు ప్రకటించామన్నారు. పోలింగ్ రోజు ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర ఉద్యోగులకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
News December 3, 2025
ఏపీ టెట్ హాల్టికెట్లు విడుదల

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <


