News April 22, 2024
ఫెయిలైన వారికి సెలవుల్లో స్పెషల్ క్లాసులు

AP: హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇటీవల విడుదలైన ఇంటల్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 1262(27.79%) మంది, సెకండ్ ఇయర్‌లో 690(37.09%) మంది విద్యార్థులే పాసయ్యారు. వీరు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించనున్నారు. జూన్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు క్లాసులు జరుగుతాయి.
Similar News
News February 20, 2026
రైల్వేలో 11,127 ఉద్యోగాలు

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెన్త్, ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
News February 20, 2026
‘అవిశ్వాసం’పై INCని ఒంటరి చేసేలా NDA వ్యూహం

LS స్పీకర్ ఓం బిర్లాపై INC, ‘ఇండీ’ పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై MAR 9న చర్చ, ఓటింగ్ జరగనుంది. దీన్ని తిప్పికొట్టేందుకు తగినంత బలం ఉన్నాINCని మరింత ఒంటరి చేసేలా NDA కొత్త వ్యూహంతో వెళ్తోంది. సభలో రాహుల్‌ను మాట్లాడనివ్వలేదన్న కారణంతో ఇచ్చిన ఈ తీర్మానంపై TMC సంతకం చేయలేదు. ఇది INC సొంత వ్యవహారంలా మారిందని ఇతర MPలూ విమర్శిస్తున్నారు. దీంతో వారి మద్దతు ఉపసంహరించేలా NDA తెరవెనుక ప్రయత్నిస్తోంది.
News February 20, 2026
ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.


