News October 26, 2024

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్.. ఉత్తర్వులు జారీ

image

AP: స్వర్ణకారులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంక్షేమ, అభివృద్ధి సంస్థను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 కింద ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల సమయంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Similar News

News October 26, 2024

నేడు క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు!

image

TG: CM రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.4గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. వారికి 2 DAలు ఇవ్వడంపై ప్రకటన చేసే ఛాన్సుంది. దీంతో పాటు రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలపడం, గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు, ఇందిరమ్మ కమిటీలు, కులగణన, SC వర్గీకరణ, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

News October 26, 2024

నందిగం సురేశ్‌పై మరో కేసు

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చేందుకు రైతుల శిబిరాలకు వచ్చిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై నందిగం సురేశ్, అతని అనుచరులు దాడి చేశారని ఓ BJP నేత ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో సురేశ్ స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే TDP ఆఫీసుపై దాడి, ఓ మహిళ హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి.

News October 26, 2024

ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ

image

AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మిగిలిన కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని తెలిసింది. 2025-26 నుంచి ఇండియన్ నర్సింగ్ కౌన్సెల్ మార్గదర్శకాలు అనుసరించి NTR హెల్త్ వర్సిటీ ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని పేర్కొన్నారు.