News July 2, 2024
రామ్‌లల్లా పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్!

అయోధ్య రామాలయంలోని పూజారుల డ్రెస్ కోడ్‌లో తీర్థ క్షేత్ర ట్రస్ట్ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పూజారులు తప్పనిసరిగా పసుపు రంగు తలపాగా, కుర్తా, ధోతీలను ధరించాలని తెలిపింది. గతంలో కొందరు కాషాయ రంగు, పసుపు రంగు దుస్తులు ధరించేవారు. వారిలో సారూప్యం తీసుకొచ్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గర్భాలయం లోపలికి పూజారులు స్మార్ట్ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.
Similar News
News December 3, 2025
మరోసారి వార్తల్లో కర్ణాటక సీఎం.. వాచ్ ప్రత్యేకతలివే

కర్ణాటకలో కుర్చీ వివాదం సద్దుమణగక ముందే CM సిద్దరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాంటోస్ డి కార్టియర్ మోడల్ లగ్జరీ వాచ్ ధర రూ.43 లక్షల 20 వేలు. 18K రోజ్ గోల్డ్‌తో తయారైంది. సిల్వర్ వైట్ డయల్‌లో గంటలు, నిమిషాలు, సెకన్ల పిన్స్ సెల్ఫ్ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్‌తో పని చేస్తాయి. 6వ నంబర్ ప్లేస్‌లో డేట్ ఫీచర్, 39.88mm వెడల్పు, 9mm మందం ఉంది.
News December 3, 2025
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: షర్మిల

కోనసీమకు TG ప్రజల దిష్టి తగిలిందంటూ Dy.CM పవన్ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. ‘పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు. మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం సరికాదు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లు కూలాయి. చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించండి’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
చౌడు నేలల్లో యూరియాను ఎలా వేస్తే మంచిది?

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.


