News February 8, 2025

10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్

image

ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.

Similar News

News March 19, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పబ్లిక్ టాక్

image

డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్‌ అభిమానులను అలరించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కించారని బెనిఫిట్ షో చూసిన పలువురు ప్రేక్షకులు తెలిపారు. పదునైన మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు. పవన్ ఎనర్జీ, డాన్సులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని పేర్కొన్నారు. కథలో కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుందని మరికొందరు అన్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.

News March 19, 2026

ఆ ఒక్క థియేటర్‌లోనే పార్కింగ్ ఫీజు రద్దు

image

TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నిషేధం కేవలం పిటిషనర్‌ పేర్కొన్న కోణార్క్(HYD) థియేటర్‌‌‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్కింగ్ ఫీజుకు అనుమతినిచ్చే GO 121 చట్టబద్ధతపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఇతర థియేటర్ల యాజమాన్యాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.

News March 19, 2026

చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

image

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.