News November 28, 2024
ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్
TG: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు, వంట పూర్తయ్యాక చెక్ చేయనున్నారు. ఇందుకోసం టీచర్లు, విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. సరిగా లేకుంటే వెంటనే మార్చేస్తారు.
Similar News
News November 28, 2024
బంగ్లాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరం: ప్రియాంక
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై MP ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్కాన్ గురు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, హిందూ మైనార్టీలపై దాడులు తీవ్ర ఆందోళనకరమని ఆమె అన్నారు. ఈ విషయాలపై బంగ్లా ప్రభుత్వం ఎదుట కేంద్ర సర్కారు తన స్వరం గట్టిగా వినిపించాలని కోరారు. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో చిన్మయ్ను అరెస్ట్ చేయగా, ఆయన్ను విడుదల చేయాలని అక్కడి హిందువులు నిరసనలు చేపట్టారు.
News November 28, 2024
టీచర్ల సెలవులపై ఆంక్షలు.. ఎత్తేయాలని డిమాండ్
AP: ఓ స్కూల్ లేదా మండలంలోని మొత్తం స్టాఫ్లో గరిష్ఠంగా 7-10 శాతం మంది టీచర్లు మాత్రమే సెలవులు వాడుకోవాలని విద్యాశాఖ షరతులు విధించింది. దీనిపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మండిపడింది. టీచర్లు అత్యవసర, ఆరోగ్య కారణాలతో తమ సాధారణ సెలవులను వినియోగించుకోవడంపై ఆంక్షలు తగవని పేర్కొంది. లీవ్స్పై పరిమితిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
News November 28, 2024
మూడేళ్లలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా TG: న్యాబ్
TG: వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇందుకోసం త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’ను తయారు చేస్తామన్నారు. డ్రగ్స్ నివారణపై పలు వర్సిటీలు, కాలేజీల సిబ్బందికి అవగాహన కల్పించారు. మార్కెట్లోకి రోజుకో కొత్త రకం డ్రగ్ వస్తోందని, నిటాజిన్ అనే డ్రగ్ ఒక్క గ్రాము 40 కిలోల ఓపీఎంతో సమానమని పేర్కొన్నారు.