News December 31, 2024
Girlfriendకు స్పెషల్ గ్రీటింగ్ కార్డ్ ❤️ గుర్తొస్తుండాయ్ పీలింగ్స్!

ఇప్పుడంటే మెసేజింగ్ యాప్స్ ఉన్నాయి. గతంలో ఇలాకాదు. న్యూఇయర్ వస్తే ఇష్టపడే/ ప్రేమించే అమ్మాయికి గ్రీటింగ్ కార్డు ఇవ్వడం గొప్ప టాస్క్. అబ్బాయికి కూడా అనుకోండి. ముందే షాపుకెళ్లి తన ఫీలింగ్స్ను వ్యక్తపరిచే పదాలు, గుర్తులు, కార్డు తెరిస్తే పువ్వులు విచ్చుకొనేలా, సౌండ్స్ వచ్చేలా ఉన్నవి వెతికేవాళ్లు. దాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేతికివ్వడం, పుస్తకాల్లో పెట్టడం గొప్ప అనుభవం. ఇలాంటి ప్రేమకథ మీకూ ఉందా?
Similar News
News December 3, 2025
WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.
News December 3, 2025
వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News December 3, 2025
స్కూళ్లలోకి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.


