News March 26, 2025

ఆన్‌లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం

image

AP: నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు CM చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. ‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. YS వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.

Similar News

News March 26, 2025

విద్యార్థులకు వాటర్ బెల్.. విద్యాశాఖ ఉత్తర్వులు

image

AP: ఎండలు తీవ్రమైన నేపథ్యంలో పాఠశాలలో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.10, 11, మ.12 గంటలకు వాటర్ బెల్ పాటించాలని పేర్కొంది. విద్యార్థులు నీళ్లు తాగేలా ఉపాధ్యాయులు చూడాలని తెలిపింది.

News March 26, 2025

ఓటీటీలో అదరగొడుతున్న ‘గేమ్ ఛేంజర్’

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రూ.450కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 7న జీ5లో హిందీ వెర్షన్ విడుదలైంది. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్-10లో దూసుకెళ్తున్నట్లు జీ5 తెలిపింది. 250మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

News March 26, 2025

కమలం + రెండు ఆకులు = ఆపరేషన్ TN

image

తమిళనాడులో కొత్త పొత్తు పొడిచేలా ఉంది. AIADMK మళ్లీ NDAలో చేరేలా కనిపిస్తోంది. 2026 TN ఎన్నికల్లో DMKను ఓడించేందుకు కమలం, రెండు ఆకులు కలిసి బరిలోకి దిగొచ్చని విశ్లేషకుల అంచనా. నిన్న ఢిల్లీలో అమిత్‌షాతో పళనిస్వామి (EPS) సహా కీలక నేతలు 2hrs సుదీర్ఘంగా చర్చించారు. అక్కడ సమావేశం అవుతుండగానే DMKను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామని ఇక్కడ అన్నామలై అన్నారు. TN చేరుకున్న EPS సైతం అదే డైలాగ్ వినిపించారు.

error: Content is protected !!