News April 30, 2024

విజయవాడ వెస్ట్‌కు ప్రత్యేక మేనిఫెస్టో: సుజనా చౌదరి

image

AP: విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారుచేస్తున్నట్లు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న BJP నేత సుజనా చౌదరి వెల్లడించారు. ‘ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా ఉంటా. 24 గంటల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటా. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఆదాయ మార్గాలు పెంచుతా’ అని Xలో పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

పుచ్చకాయలో పోషకాలు ఎన్నో!

image

పుచ్చకాయలోని 91-92% నీరు వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, సిట్రులిన్ రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తక్కువ క్యాలరీల వల్ల, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. విటమిన్ A, C వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. విటమిన్-C ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వ్యాయామం తర్వాత కండరాల నొప్పులను తగ్గించడంలో పుచ్చకాయ జ్యూస్ సాయపడుతుంది.

News March 19, 2026

రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

image

TG: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరంగా ఉండబోతోందని చెప్పారు. ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ ‘అన్నదాతలకు ₹2లక్షల వరకు రుణమాఫీ చేశాం. భూభారతితో భూమి సమస్యలను పరిష్కరిస్తున్నాం. రైతు భరోసాకు ₹18వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల 22న మరో విడత డబ్బులు రిలీజ్ చేయనున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.

News March 19, 2026

IPL కోసం ఆల్కహాల్ మానేశా: చాహల్

image

6 నెలలుగా ఆల్కహాల్ మానేసినట్లు డివిలియర్స్ పాడ్‌కాస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. 35 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుని IPLలో టీమ్ కోసం 150% శ్రమించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడటం తనను నిరాశపర్చిందన్నారు. అందుకే ఈసారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తున్నానని, పంజాబ్ కింగ్స్‌లో సీనియర్ ప్లేయర్‌గా రోల్ మోడల్‌గా ఉండాలనుకుంటున్నట్లు వివరించారు.