News April 3, 2024

తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

image

TG: రాష్ట్రంలో తాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వేసవి నేపథ్యంలో చాలా జిల్లాల్లో నీటి కటకట మొదలైంది.

Similar News

News January 25, 2026

982 మంది పోలీసులకు అవార్డులు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధుల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు 982 మంది పోలీసులను ఉన్నతస్థాయి అవార్డులు వరించాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులకు గ్యాలెంటరీ, సర్వీస్ మెడల్స్, పలువురిని రాష్ట్రపతి అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. 982లో 125 గ్యాలెంటరీ, 101 ప్రెసిడెంట్, 756 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.

News January 25, 2026

12 మంది సూర్యులు మీకు తెలుసా?

image

మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అనుకుంటాం. కానీ విశ్వంలో 12 సూర్యులు ఉన్నారని రుషులు చెప్పారు. వారిని ద్వాదశాదిత్యులు అంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే వీరు 12 మాసాలకు ఆధిదేవతలు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలో సంచరిస్తూ కాలాన్ని విభజిస్తాడు. మాఘమాసంలో సూర్యుడు “అర్క” నామంతో ప్రకాశిస్తాడు.

News January 25, 2026

పసుపులో ముర్రాకు తెగులు, దుంపకుళ్లు.. నివారణ

image

అక్టోబర్‌లో వాతావరణ పరిస్థితులకు పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.