News March 25, 2025
ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్: కేంద్రమంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవటంతో పాటు సులభంగా అప్లై చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధిని 15 నెలల నుంచి 8నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటివరకు 89లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.
Similar News
News November 29, 2025
కాళోజీ వర్సిటీ ఇష్యూ.. చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం: రేవంత్

TG: కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలతో పాటు ఇన్ఛార్జుల నియామకంలో ఆరోపణలపై ఆయన ఆరా తీశారు. ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆరోపణలతో కాళోజీ వర్సిటీ వీసీ డా.నందకుమార్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.
News November 29, 2025
మస్క్ ఆఫర్‌ను రిజక్ట్ చేసిన చైనా విద్యార్థులు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నుంచి ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ xAI నుంచి వచ్చిన మల్టీ మిలియన్ డాలర్ ఆఫర్‌ను ఇద్దరు చైనా విద్యార్థులు విలియం చెన్, గువాన్ వాంగ్ తిరస్కరించారు. అత్యంత సామర్థ్యం ఉన్న OpenChat మోడల్‌ను అభివృద్ధి చేసి వీరు మస్క్‌ను ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన ఆఫర్‌ను కాదని స్వయంగా సరికొత్త AIని రూపొందించేందుకు Sapient Intelligenceను స్థాపించి సక్సెస్ అయ్యారు.
News November 29, 2025
అప్పటికల్లా నక్సలిజం అంతం: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్‌పూర్‌లో జరిగిన DGP, IGP సదస్సులో మాట్లాడారు. తదుపరి కాన్ఫరెన్స్ జరిగే నాటికి ముందే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఏడేళ్లుగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2014లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 ఉండగా, ప్రస్తుతం 11కి తగ్గినట్లు వెల్లడించారు.


