News August 5, 2024

‘కన్నప్ప’ నుంచి స్పెషల్ పోస్టర్.. నెట్టింట ట్రోల్స్

image

మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి ‘ముండడు’ క్యారెక్టర్‌ పోస్టర్ రిలీజైంది. దీనిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ‘యమదొంగ’ మూవీలో నటుడు అలీ వేసుకున్న కాస్ట్యూమ్స్ గుర్తొస్తున్నాయని సెటైర్లు వేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తీసే సినిమాలో కాస్ట్యూమ్స్ గురించి పట్టించుకోరా? అని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 17, 2026

సిరిసిల్ల: ఎన్నికల ఖర్చుపై కార్యదర్శుల్లో ఆందోళన

image

గత పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్లు ప్రారంభం నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బందికి అల్పాహారం, భోజనాలు, టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కో కార్యదర్శి రూ.30 వేల పైగా ఖర్చు చేశారు. GPని బట్టి రూ.6-8 వేల వరకు ఖర్చులు అందించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా ఖర్చులకు లెక్కలు అడగకపోవడంపై కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

News January 17, 2026

కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..

image

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్‌ ఆహారాలు, తగిన నిద్ర, నీరు తీసుకోవడం, సన్ స్క్రీన్ ఎక్కువగా వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

News January 17, 2026

శ్రీనివాసుడికి శనివారం ఎందుకు ప్రీతికరమైనది?

image

వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజు. ఓంకారం ప్రభవించిన, స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న, ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా శనివారమే. తన భక్తులను పీడించనని శనిదేవుడు శ్రీనివాసుడికి మాట ఇచ్చింది కూడా ఈ రోజే. అందుకే 7 శనివారాలు నియమంతో స్వామిని పూజించి, 7 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. స్వామివారికి శనివారంతో ఉన్న ఈ అనుబంధం వల్లే భక్తులు శనివారాలు ఉపవాసాలు ఉంటారు.