News December 16, 2024
శేష్ ‘డెకాయిట్’ నుంచి స్పెషల్ పోస్టర్

అడివి శేష్ హీరోగా షానియెల్ దేవ్ తెరకెక్కిస్తోన్న ‘డెకాయిట్’ సినిమా నుంచి పోస్టర్ రిలీజైంది. ‘తనని కాపాడినా.. కానీ ఒదిలేసినాది. తను ఏంటో.. అసలెవరో రేపు తెలిసొస్తాది’ అని శేష్ రాసుకొచ్చారు. దీంతో ఆ అప్డేట్ ఏంటా? అనే దానిపై ఇంట్రెస్ట్ పెరిగింది. కాగా, మొదట శృతి హాసన్ను ఈ చిత్ర హీరోయిన్గా అనుకోగా.. పోస్టర్లో మృణాల్ ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.
Similar News
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.
News December 1, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ, ఉ.గోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఇవాళ 5PM వరకు నెల్లూరు(D) కొడవలూరులో 38.7mm, నెల్లూరులో 36.7mm, తిరుపతి(D) తడలో 33.5MM వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


