News August 3, 2024

SPECIAL: అరుదైన చిరుతపులి

image

కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్ రిజర్వ్‌లో అరుదైన చిరుత పులి కనిపించింది. రెండు వేర్వేరు రంగులు కలిగిన కళ్లతో ఉన్న ఈ చిరుతపులిని ఫొటోగ్రాఫర్ ధ్రువ్ పాటిల్ తన కెమెరాలో బంధించారు. సఫారీలో పాల్గొన్న ఆయన చెట్టుపై ఉన్న చిరుతను ఫొటో తీసి గమనించగా ఓ కన్ను నీలం- ఆకుపచ్చ, మరోటి గోధుమ రంగుతో కనిపించాయి. హెటెరోక్రోమియా వల్ల ఇలా కళ్ల రంగు మారి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News March 10, 2026

ఖమ్మంలో మార్చి 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ

image

ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం సర్పంచ్‌లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు, వార్డు కౌన్సిలర్లకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అవగాహన కల్పించారు.

News March 10, 2026

బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చెప్పండి: మనోహర్

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని, గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఎక్కడైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 10, 2026

చమురులో రకాలు.. ఈ విషయం తెలుసా?

image

అమెరికా, వెనిజులా, ఇరాన్, రష్యాలో లభించే చమురులో ఉండే వ్యత్యాసాల గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన WTI (39–41° API) అత్యంత తేలికైనది కాగా వెనిజులాకు చెందిన Merey (15–16° API) అత్యంత బరువైనది. ఇరాన్ చమురు (33–36° API) మధ్యస్థంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా అనేక రిఫైనరీలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో సరఫరా నిలిస్తే, రిఫైనరీల సామర్థ్యం తగ్గి లాభాలు పడిపోతాయి.