News April 6, 2025
అగ్నివీర్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు

అగ్నివీర్‌లకు పోలీసు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ తెలిపారు. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వారికి ప్రత్యేక సబ్సిడీలు అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో అగ్నివీర్‌లకు రాష్ట్ర నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా హరియాణా నిలిచింది.
Similar News
News October 18, 2025
బీసీ సంఘాల ‘రాష్ట్ర బంద్’.. నేతల వ్యాఖ్యలు

* బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కుట్రపూరితంగా స్టే తెచ్చారు. కోర్టులు మా మాట వినలేదు: R. కృష్ణయ్య
* రిజర్వేషన్లపై PM మోదీ వద్ద బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు: మహేశ్ కుమార్ గౌడ్
* బీసీ బిల్లు ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణం: మంత్రి కొండా సురేఖ
* కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానమే తప్పు: మాజీ మంత్రి తలసాని
* బీసీల హక్కులను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే: ఈటల
News October 18, 2025
ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ A, C, B, E, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News October 18, 2025
పాకిస్థాన్‌ది అనాగరిక చర్య: రషీద్ ఖాన్

జనావాసాలపై పాక్ చేసిన వైమానిక దాడిని అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ అనాగరిక, ఆటవిక చర్యలో మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నా ప్రజల పక్షాన నిలబడతా’ అని ట్వీట్ చేశారు.