News June 28, 2024
T20WCలో టీమ్ఇండియాకి ప్రత్యేక రూల్స్: ఇంజమామ్

T20WCలో అన్ని జట్లకు ఒక రూల్ ఉంటే భారత్‌కు మాత్రం ప్రత్యేక రూల్స్ ఉన్నాయని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ మండిపడ్డారు. ‘2వ సెమీఫైనల్ చూస్తేనే అది అర్థమవుతోంది. INDvsENG గేమ్‌కు మాత్రమే రిజర్వు డే లేదు. పైగా టోర్నీ ఆరంభానికి ముందే వారి సెమీస్ వేదిక ఫిక్స్ చేశారు. రిజర్వు డే లేకపోవడంతో వర్షం పడినా భారత్ ఫైనల్‌కు వెళ్లేలా చూసుకున్నారు. ప్రపంచ క్రికెట్‌ను BCCI శాసిస్తోంది’ అని ఆరోపించారు.
Similar News
News December 17, 2025
రిజల్ట్స్: కూతురిపై తండ్రి.. తల్లిపై కూతురు విజయం

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర విజయాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం(D)లోని పెనుబల్లిలో తల్లి తేజావత్‌పై కూతురు బానోతు పాపా గెలుపొందారు. నారాయణపేటలోని కోల్పూరులో కూతురిపై తండ్రి రాములు 420 ఓట్ల తేడాతో గెలుపొందారు. సొంతింటి వారే ప్రత్యర్థులుగా మారిన ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. అటు ఆదిలాబాద్(D) బరంపూర్‌లో 69 ఏళ్ల(ఏకగ్రీవం) తర్వాత జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి దేవరావు గెలిచారు.
News December 17, 2025
సర్పంచ్ ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

TG: మూడో విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,502, BRS 866, BJP 163, ఇతరులు 325 చోట్ల గెలిచారు. 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో BRS లీడ్‌లో ఉంది. జనగామ, యాదాద్రి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్-BRS మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది.
News December 17, 2025
పురుషుల ఖాతాల్లోకి రూ.10వేలు.. అధికారులకు తిప్పలు

బిహార్‌లో అధికారులకు కొత్త తంటాలు వచ్చి పడ్డాయి. మహిళలకు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం ద్వారా రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గ్రామాల్లో పొరపాటున ఈ డబ్బులు పురుషుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో వాటిని రికవరీ చేసేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా ఆ డబ్బు ఖర్చు చేసినట్లు వారు పేర్కొన్నారు. తాము డబ్బు ఇవ్వలేమని, తమను క్షమించాలని సీఎంను కోరుతున్నారు.


