News July 4, 2024
తీర్మానాలతో ప్రత్యేక హోదా రాదు: కేంద్రమంత్రి

AP: ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే వస్తే అంశం కాదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేస్తాయన్నారు. హోదా అంశంపై ప్రధాని స్థాయిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. బీహార్‌కు సైతం ఇదే వర్తిస్తుందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే గతంలో ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ నిధులతో AP అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
Similar News
News November 24, 2025
19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News November 24, 2025
ధర్మేంద్ర బాలీవుడ్ ‘He-Man’ ఎలా అయ్యారంటే?

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్ అని నిక్ నేమ్ ఉంది. ధర్మేంద్రకు ఉన్న మస్క్యులర్ బాడీ, రగ్గ్డ్ లుక్స్, 1960-70ల మధ్య ఎక్కువగా యాక్షన్ పాత్రలు చేయడంతో ఆయనకు ఈ పేరు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి జానర్స్ కలుపుకుని దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర చివరిగా నటించిన ‘ఇక్కీస్’ అనే చిత్రం త్వరలో విడుదలకానుంది.
News November 24, 2025
ఆఖరి మజిలీలో అడవి పార్టీ!

అట్టడుగు వారికి చట్టం చేయని న్యాయం తుపాకీ గొట్టం చేస్తుందని నమ్మిన అడవి పార్టీ ఆఖరి మజిలీలో ఉంది. అర్ధ శతాబ్దం క్రితం సమాజంలో వారి అవసరం, ఆ స్థాయిలో మద్దతూ ఉండేవి. కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల జీవనం మారాయి. కానీ నక్సలైట్లుగా మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందినా తమ పోరాట పంథా మార్చుకోలేదు. ఫలితం.. ప్రజలకు పరిష్కారం అవుతామన్న ‘అన్న’ తమ ఊపిరి ఉండాలంటే ‘గన్ను’ వీడటమే పరిష్కారమనేలా చేసింది.


