News August 1, 2024
చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు: మందకృష్ణ మాదిగ

ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణను అప్పటి సీఎం చంద్రబాబే చేశారని MRPS అధినేత మందకృష్ణ మాదిగ గుర్తుచేశారు. ‘అప్పట్లో చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు మా వాళ్లకు వచ్చేవి కాదు. ఆరోజు ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. వర్గీకరణ అమలు జరుగుతుంది. బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని మందకృష్ణ చెప్పారు.
Similar News
News March 26, 2026
మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిలాపియా రకం చేపలను పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
News March 26, 2026
కల్తీ పాల ఘటన.. CS, DGPకి NHRC నోటీసులు

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) సుమోటోగా తీసుకుంది. ఈ ఉదంతంపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ఘటనలో 16 మంది <<19447985>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
News March 26, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తుకు 5 రోజులే గడువు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 31తో గడువు ముగియనుంది. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏప్రిల్ 1 – 8వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్: bsnl.co.in/


