News February 5, 2025
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్రాజ్ వెళ్లనున్నాయి.
Similar News
News December 28, 2025
తిరుమలలో స్థలం ఇవ్వాలని పవన్, అనగానిల అభ్యర్థన.. తిరస్కరించిన TTD

AP: తిరుమలలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ల అభ్యర్థనను టీటీడీ తిరస్కరించింది. ఈ నెల 16న పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా బయటకు వచ్చింది. కొండపై పరిమితంగా భూములు ఉండటం, కొత్త నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న భవనాలు కేటాయిస్తామని సదరు మంత్రులకు సమాచారం ఇచ్చింది.
News December 28, 2025
TET: 500 కి.మీ. దూరంలో సెంటర్లు

TG: టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొందరు అభ్యర్థులకు ఖమ్మంలో సెంటర్లు కేటాయించారు. దాదాపు 500KMకు పైగా దూరం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని పరీక్ష రాసే ఇన్ సర్వీస్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలస్యంగా అప్లై చేసుకున్న వారికే దూరంగా సెంటర్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
News December 28, 2025
దానిమ్మ తోటలపై క్రాప్ కవర్ వల్ల లాభాలేమిటి?

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.


