News January 28, 2025
HYD నుంచి కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
Similar News
News November 23, 2025
ఖమ్మం: సామాన్య కార్యకర్త నుంచి జిల్లా సారథిగా..

ఖమ్మంకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వైరా నేత నూతి సత్యనారాయణ గౌడ్ రాజకీయ ప్రస్థానం దశాబ్దాల నాటిది. గతంలో ఆయన NSUI, యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయడంలో, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
News November 23, 2025
పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.
News November 23, 2025
పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.


